విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ క్రేజీ మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. లైగర్, ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో వరుసగా డిజాస్టర్స్ చూసిన విజయ్.. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని రెండు పార్టులుగా తీస్తున్నారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసేందుకు అంతా రెడీ చేశారు. ఈ నెల 12న ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేయనున్నారు.
అయితే.. ఈ పాన్ ఇండియా మూవీ టీజర్‌కు వివిధ భాషల్లో వివిధ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళ టీజర్‌కు సూర్య, హిందీ టీజర్‌కు రణ్‌బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక తెలుగులో దేవరకొండ కోసం దేవర వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత నాగవంశీ కలిసిన ఫోటో రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ ఎన్టీఆర్ కు థ్యాంక్స్ తెలియచేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.