ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. అరుణ్ జైట్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 4 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. ఈ సీజన్లో ఢిల్లీ నాల్గో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 225 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులకే పరిమితమైంది.


