హీట్ వేవ్స్ దేశంలోని పలు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. తీవ్రమైన వడగాల్పులు, అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, హర్యానాతోపాటు పంజాబ్, బీహార్‌ను ఎండ లు, వడగాల్పులు దడదడలాడిస్తున్నాయి. రెండు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో 20 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఓ వైపు ఎండలు, మరో వైపు నీటి సంక్షోభంతో నగర వాసులు అల్లాడి పోతున్నారు. ఎండలు, వడగాల్పులతో జనం పిట్టల్లారాలిపోవడం తీవ్ర కలకలం రేపు తోంది. వడదెబ్బల కేసుల్లో మరణాల రేటు 60 నుంచి 70 ఉందని వైద్యులు చెబుతున్నారు. రోగుల్లో చాలామంది కూలీలే ఉన్నట్లు తెలిపారు వైద్యాధికారులు. ఎక్కువగా 60 ఏళ్లు దాటినవారే ఉన్నారని, హీట్‌స్ట్రోక్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవస రం ఉందన్నారు. గత నెల రోజలుగా ఢిల్లీ నగరం అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కవుతోంది. నగర గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు కనిష్ఠ ఉష్ణో్గ్రతలు 35 డిగ్రీల మార్కును కూడా దాటేశాయి. గతవారం నుంచి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లో వేడి గాలులు తీవ్రత పెరిగింది. ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు రెడ్ అలెర్ట్‌ను జారీ చేశారు. మరోవైపు బిహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్‌లో కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంది. రాబోయే 24 గం.లపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని, ఆ తర్వాత దీని తీవ్రత తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలి పింది.