ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో అధికారులు ఇవాళ మధ్యాహ్నం ఆయన్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనుంది. ఈనేపథ్యంలోనే మరో 5 నుంచి 7 రోజులు కేజ్రీవాల్‌ను ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతకు ముందు తన అరెస్టును, ఈడీ కస్టడీకి పంపుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆయనకు మధ్యం తర బెయిల్ ఇచ్చేం దుకు నిరాకరించింది. అలాగే కేజ్రీవాల్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని కోరుతూ ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇంకోవైపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి కోర్టులో కేజ్రీవాల్ అన్ని నిజాలు బయటపెడతారని, డబ్బు ఎక్క డుందో చెబుతారని, ఈ మేరకు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పిస్తారని చెప్పారు. దీంతో కేజ్రీవాల్ కోర్టులో ఎలాంటి నిజాలు బయటపెట్టబోతున్నారని ఆసక్తిగా మారింది.
ఆ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ స్వరణకాంత శర్మ విచారణ జరిపారు. తొలుత ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ, తమకు మంగళవారమే కేజ్రీవాల్ పిటిషన్ కాపీ అందిందని, దాన్ని పరిశీలించి బదులిచ్చేందుకు మూడువారాల సమయం కావాలని కోరారు. దీనిపై కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ జాప్యం చేయటానికే పిటిషన్‌పై బదులి చ్చేందుకు ఈడీ మరింత సమయం కోరుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి ఈడీకి సరైన ప్రాతిపదికే లేదన్నారు. మూడు వారాల గడువు ఇస్తే ఈలోపు మళ్లీ ఏదో ఒక స్రిప్టు సిద్ధం చేస్తారని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నిస్తూ కేజ్రీవాల్‌కు ఉన్న సహజ, ప్రాథమిక, మానవ హక్కులను ఈడీ ఉల్లఘించింది. అందుకే దీన్నో తప్పుడు కేసుగా పరిగణించి కేజ్రీవాల్‌ను విడుదల చేయాలన్నారు. గురువారంతో కేజ్రీవాల్ రిమాండ్ గడువు ముగుస్తుంది. ఈలోపే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై న్యాయ మూర్తి స్పందిస్తూ మధ్యంతర బెయిల్ కోరుతూ దరఖాస్తు చేసే స్వేచ్ఛ బాధితుడికి ఉంటుంది. అదే సమయంలో దానిపై సమాధానం చెప్పడానికి ఈడీకి అవకాశం ఇవ్వడం తప్పనిసరి. ఈడీ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం లేదనిపిటిషన్ తరఫున న్యాయవాది చేసిన వాదనను తిరష్కరిస్తున్నామని స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ సాయంత్రం తీర్పును వెల్లడిం చారు.