హైకోర్టులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని రాజు యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. ఒక పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా…మరో పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం రాజ్యంగ విరుద్దమని పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు దానం నాగేందర్. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.