వివేకా హత్య కేసులో అప్రూవర్ గాఉన్న దస్తగిరి సంచలన ఆరోపణలు చేసారు. సొంత చిన్నాన్నను హత్య చేయిం చిన జగన్ కు ఓటు అడిగే హక్కులేదని అన్నారు. వైఎస్ వివేకా హత్య అనంతరం పశ్చాత్తాపం తో అప్రూవర్ గా మారి పోయానని తెలిపారు. సీబీఐ ఒత్తిడి చేయడంతో అప్రూవర్ గా మారా నని చెప్పాలని దేవిరెడ్డి శంకర్ రెడ్డి కొడుకు చైతన్య మరికొంత మంది ఒత్తిడి తెచ్చారని తెలిపారు. తమ మాట వినకపోతే చంపుతామని బెదిరింపులకు కూడా పాల్పడ్డార న్నారు. దేవిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి కొడుకు చైతన్య జైలులో కలిసి వివేకా హత్య గురుంచి మాట్లాడకూడదని బెదిరిం పులకు పాల్పడ్డారని ఆరోపించారు.


