సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. తమిళ నటుడు డేనియల్ బాలాజీ గుండెపోటుతో కన్నుమూ శారు. నిన్న రాత్రి చాతిలో నొప్పి వచ్చిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.
డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం 50 కి పైగా సినిమాలు చేశాడు. తెలుగులో ఘర్షణ,చిరుత,టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గర య్యాడు. ఎక్కువగా విలన్ రోల్స్ లో నటించాడు. బాలాజీ మృతి పట్ల తమిళ పరిశ్రమకు చెందిన ప్రము ఖులు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చెన్నైలోని పురసామివాకంలో డేని యల్ బాలాజీ అంత్య క్రియలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
డేనియల్ బాలాజీ తెలుగు మూలాలు ఉన్న నటుడు. ఆయన తండ్రి తెలుగువాడు. తల్లి తమిళం. దీంతో డేనియల్ తమిళ.దర్శకుడిగా మారాలని సినిమాల్లోకి వచ్చారు. కానీ నటుడిగా స్థిరపడ్డారు. దర్శకుడు గౌతమ్ మేనన్ తో డేనియల్ బాలాజీకి మంచి అనుబంధం ఉంది. ఆయన తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలోనూ సినిమాలు చేశారు. ఎక్కువగా ప్రతినాయకుని పాత్రల్లో కనిపించి మెప్పించారు. చిట్టి అనే తమిళ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు డేనియల్ బాలాజీ. ఎన్టీఆర్ సాంబ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అనంతరం వెంకటేశ్ ఘర్షణ చిత్రంలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించి మెప్పించారు. రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లోనూ నటించారు. నానిటక్ జగదీష్‌లోనూ మెయిన్ విలన్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ఇదే ఆయన చివరి తెలుగు చిత్రం.