నష్టపోయిన పంటలకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు సీపీఎం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఎండి పోయిన వరిపంటను ఆయన పరిశీలించారు. పంటలు ఎండిపోయి రైతులు దారుణ పరిస్థితుల్లో ఉన్నా రని పోతినేని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు వేల ఎకరాల్లో పంట ఎండిపోవడానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడ పంట ఎండిపోయిందో రెవిన్యూ టీములు ఏర్పాటు చేసి ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వాలని సుదర్శన్ డిమాండ్ చేశారు.


