22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

రాష్ట్ర ప్రగతికి పరిశ్రమలు ఎంతో కీలకం: మంత్రి శ్రీధర్‌బాబు

పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ లను రుచితో పాటు నాణ్యతతో అందించడమే లక్ష్యంగా ‘డెయిరీ ట్రెండ్స్‌’ అనే సంస్థను స్థాపించారు శ్యాంసుందర్ రెడ్డి. శుక్రవారం అమీర్‌పేట్‌ మ్యారిగోల్డ్‌ హోటల్‌లో డెయిరీ ట్రెండ్స్‌ సంస్థ యొక్క లోగో మరియు ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఐటీ శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, ప్రముఖ సినీ హీరో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

డెయిరీ ట్రెండ్స్‌ లోగోను ఆవిష్కరించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ, ” రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్ళడంలో, ఉపాధి కల్పనలో ప్రైవేట్‌ రంగ సంస్థలు, వ్యాపార పరిశ్రమలు ఎంతో కీలకం. యువతకు ఉపాధితో పాటు స్వయం ఉపాధి కల్పించడంలో కీలకంగా ఉంటున్న వ్యాపారులకు, వాణిజ్య రంగ సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తున్నాము. వారికి అన్ని రకాలుగా అండగా ఉండేందుకు పలు పాలసీలను సైతం తీసుకొచ్చాము. ఏ సంస్థ అయినా వినియోగదారులకు మెరుగైన ఉత్పత్తులతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి. అప్పుడు ప్రజాదరణ చూరగొంటారు.” అని అన్నారు.

డెయిరీ ట్రెండ్స్‌ ఉత్పత్తులను ఆవిష్కరించిన అనంతరం విశ్వక్‌సేన్‌ మాట్లాడుతూ, “ఇది కమర్షియల్ ఈవెంట్ కాదు. నా స్నేహితుడి కోసం ఇక్కడకు వచ్చాను. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఇద్దరం కలిసి చదువుకున్నాం. అంకుల్ కూడా మా నాన్నలాగే పోటీపడి నన్ను తిట్టేవాడు. మా నాన్న, అంకుల్ ఇద్దరూ కూడా స్నేహితులు. కేవలం స్నేహం కోసమే ఇక్కడికి వచ్చాను. నాకు లాంచింగ్ విషయం తెలియగానే, నేనే వస్తా అని చెప్పా. ‘లైలా’ షూటింగ్ కోసం నైట్ షెడ్యూల్స్ జరుగుతున్నాయి. లుక్ రివీల్ కాకూడదని అనుకున్నా. కానీ మాస్క్ పెట్టుకుని వస్తే బాగోదని ఇలా వచ్చేశా. డెయిరీ ట్రెండ్స్ ఐస్ క్రీమ్ బ్రాండ్ బాగా పాపులర్ అవ్వాలి. నా మిత్రుడికి మంచి పేరు తీసుకురావాలి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరికీ కావాల్సిన అన్ని ఫ్లేవర్స్ కూడా డెయిరీ ట్రెండ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. నేను కూడా టేస్ట్ చేశాను. అన్ని ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అందరూ తప్పకుండా టేస్ట్ చేయండి” అన్నారు.

ఈ కార్యక్రమంలో డెయిరీ ట్రెండ్స్‌ సీఈవో శ్యాంసుందర్, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నిర్మాత బండ్ల గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

విరాట్‌ కోహ్లీపై ఐసీసీ చర్యలు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మ్యాచ్ రిఫరీ కఠిన చర్యలు తీసుకున్నారు. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు ఓ డీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్