తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల పైన బీజేపీ పోరాటానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ఎడాది పాలనపై బీజేపీ నిరసన సభ నిర్వహించనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు సభకు హాజరుకానున్నారు. 6 అబద్ధాలు 66 మోసాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ విధానల పైన…. గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైన చార్జిషీట్ విడుదల చేశారు. తాజాగా నిరసన కార్యక్రమాల ముగింపు సందర్భంగా సరూర్ నగర్ స్టేడియంలో నిరసన సభ నిర్వహిస్తున్నారు.