టీమిండియా స్టార్ ప్లేయర్ గబ్బర్ శిఖర్ ధావన్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన చిన్నప్పుడు జరిగిన ఫన్నీ ఘటనను ప్రేక్షకులతో పంచుకున్నాడు. తనకు 15ఏళ్లు ఉన్నప్పుడు మనాలి వెళ్లానని.. పేరెంట్స్ కు తెలియకుండా వీపు మీద టాటూ వేయించుకున్నానని తెలిపాడు. తర్వాత నాన్నకు తెలిసి సూదితో ఎందుకు టాటూ వేయించుకున్నావని కొట్టారన్నాడు. అలాంటి సూదితో పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పడంతో.. భయమేసి ఎయిడ్స్ టెస్టు చేయించుకున్నానని వెల్లడించాడు. ఆ టెస్టులో నెగటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నానని గతాన్ని గుర్తుచేసుకున్నాడు గబ్బర్. అలాగే రాజకీయాల్లో వస్తారా అనే ప్రశ్నకు.. దేవుడు సంకల్పిస్తే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశాడు.