ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఫుల్ మజా ఇచ్చే ఫ్రాంచైజీ లీగ్ ఐపీఎల్. గత 15 సంవత్సరాలుగా అభిమానులను అలరిస్తోన్న ఐపీఎల్ 16వ సీజన్ రెండు వారాల క్రితమే ప్రారంభమైంది. ఉత్కంఠమైన మ్యాచులతో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తోంది. సాయంత్రం అయితే చాలు అందరూ టీవీలు, ఫోన్లకు అతుకుపోతున్నారు. సాధారణ ప్రేక్షకులతో పాటు బెట్టింగ్ రాయుళ్లు కూడా ఐపీఎల్(IPL) మజాను ఆస్వాదిస్తున్నారు. కోట్ల రూపాయలు బెట్టింగులు కాస్తూ రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ లో ఇలాంటి బెట్టింగ్(Cricket Betting ) ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గత రెండు రోజుల్లోనే నగరంలో పలు చోట్లు బెట్టింగ్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదుతో పాటు సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాపులను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3వారాలు బెడ్ రెస్ట్
Follow us on: Youtube, Instagram, Google News