కేంద్రంలో మోదీ సర్కార్ అమలు చేస్తున్న పౌరసత్వ సవరణ చట్టాన్ని సీపీఎం పూర్తిగా వ్యతిరేకిస్తు న్నట్లు నాయకు రాలు బృందా కారత్ స్పష్టం చేశారు. సిఏఏలో మూడు ప్రధాన అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని ఆమె తెలిపారు. ఇది పౌరసత్వం నిర్వచనాన్ని మారుస్తుంది, ఇది చాలా వివక్షా పూరితమైన మతంతో ముడిపడుతున్న చట్టం. ఎన్నికల ప్రకటన 3 రోజులు ఉందనగా, ఈ సమయం లో ప్రకటన చేయడం దారుణం. ఈ కారణంగా తాము దానిని వ్యతిరేకి స్తున్నామన్నారు. బిజెపి పోలరైజేషన్, విభజనపైనే బలపడింది. అది వారి రాజకీయాల డిఎన్ఎలో ఉంది. ఈ చట్టం నిబంధనలు రాజ్యాంగ స్వభావానికి విరుద్ధంగా ఉన్నాయి. చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు ఇవ్వలేదని బృందాకారత్.


