నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని డిమాండ్.!
చట్టసభలో అబద్థాలు చెప్పిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. మాఫియా గ్యాంగ్‌కు ఆమె సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పోకడలు సామాన్య ప్రజలను ఇరకాటంలో పడేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీలకు బీజేపీ అగ్రనేతలు ఊడిగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జీ20- 420చేతిలో పడిందని ఆరాపించారు. జీ20 లోగోను బీజేపీ ఎన్నికల గుర్తుగా మార్చి ప్రచారం చేసే దుస్థితి రాబోతోందన్నారు. బీజేపీని విమర్శించే పార్టీ నేతలను మోదీ ప్రభుత్వం టార్గెట్ చేస్తూ.. కక్షపూరితంగా వ్యవహరిస్తోందని నారాయణ మండిపడ్డారు.