బండి సంజయ్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు భరోసా కల్పించకుండా ఇలా రాజకీయాలు చేయడం తగదని అన్నారు. ప్రభుత్వమే కథ అల్లి పోలీసులతో చెప్పించినట్లు మేం భావిస్తున్నామని తెలిపారు. వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు చెప్పిన అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవేనని అన్నారు. శివ గణేశ్ తీసిన ఫొటో మొదట ఎవరికి వెళ్లింది. ఆ పేపరు ఎంత మందికి వెళ్లిందో.. ఆ అందరినీ విచారించారా..? అంటూ ప్రశ్నించారు.
అధికార పార్టీని సంతృప్తి పరిచేందుకు సీపీ వ్యవరిస్తున్న తీరు సరికాదని రఘునందన్(Raghunandan Rao) వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు జరిగిన అన్యాయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. మేమేమైనా గోడ దూకి వెళ్లి హిందీ పేపర్ ఫొటో తీసినట్లు చెబుతున్నారు. ఫొటో తీస్తుంటే పోలీసుల నిఘా ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బండి సంజయ్‌కు ఉదయం 11.20 తర్వాత పేపర్ వచ్చిందని చెబుతున్నారు. ఫొటో తీసిన వ్యక్తికి బీజేపీతో ఏమైనా సంబంధం ఉందా..? ఇలాంటివి ఏం చెప్పకుండా అరెస్ట్ చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.
Read Also: పేపర్లను లీక్ చేసే స్థాయికి బండి సంజయ్ దిగజారటం దౌర్భాగ్యం: పువ్వాడ
Follow us on: Youtube, Instagram, Google News