25.7 C
Hyderabad
Sunday, April 27, 2025
spot_img

తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీపీ రాధాకృష్ణన్‌

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌ గవర్నర్‌గా ఉన్న రాధాకృష్ణన్‌.. అదనంగా తెలంగాణ బాధ్యతలు స్వీకరించారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన్ను నియమించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌.. తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు బీజేపీ సీనియర్‌ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ సీపీ రాధాకృష్ణన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్లుగా పనిచేసిన నరసింహన్‌, తమిళిసై సౌందరరాజన్‌తో పాటు ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన సీపీ రాధాకృష్ణన్‌.. ముగ్గురూ తమిళనాడు వారే.

Latest Articles

‘రెట్రో’తో సూర్య అన్న మరో ఘన విజయం సాధించాలి: విజయ్ దేవరకొండ

కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రెట్రో'. పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలోని 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మే 1వ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్