31.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

మరోసారి రికార్డ్ సృష్టించిన ఫిన్లాండ్‌

ఫిన్లాండ్‌ దేశం మరోసారి రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్‌ వరుసగా ఏడవసారి అగ్రస్థానంలో నిలిచి తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది. అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ హ్యాపినెస్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం ఫిన్లాండ్‌ అగ్రస్థానంలో.., డెన్మార్క్‌ రెండవస్థానంలో,.. ఐస్‌లాండ్‌ మూడవ స్థానంలో ఉండగా.. భారత్‌ 126వ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇండియా ఒకస్థానం కిందకు దిగింది. ఇక తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్‌ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది. చైనా 60, నేపాల్‌ 95, పాకిస్థాన్‌ 108, మయన్మార్‌ 118 స్థానాల్లో నిలిచాయి. అయితే,.. ఈ దేశాలు మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని తెలిపింది పరిశోధకుల బృందం.

ఆత్మ సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా సంతోష సూచికను తయారు చేస్తారు. దాదాపు దశాబ్దకాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి కిందకు దిగజారాయి. యునెటైడె స్టేట్స్‌ 23 స్థానం, జర్మనీ 24వ స్థానంలో నిలిచాయి. అయితే టాప్‌ 20లో కోస్టారికా 12, కువైట్ 13 స్థానాలు దక్కించుకోవడం విశేషం. ఈ ఏడడా టాప్‌ 10లో పెద్ద దేశమేది లేదని తన నివేదికలో పేర్కొంది ఐక్యరాజ్యసమితి. ఇక ఈ జాబితాలో తొలి టాప్‌ 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్స్‌, ఆస్ట్రేలియా మాత్రమే ఉన్నాయి.

3 కోట్ల జనాభా కంటే అధికంగా పాపులేషన్‌ ఉన్న కెనడా, యూకేలు టాప్‌ 20లో ఉన్నాయి. అలాగే ఈ రిపోర్టులో పెద్ద వారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఇలా ఒకే విధంగా సంతోషంగా లేరని.. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తెలిపింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసులవారిలో సంతోషం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకేరకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు వెల్లడయింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని.. ఇది ఆందోళన కలిగించే విషయమని తెలిపింది.

ఫిన్‌లాండ్‌ సంపన్న దేశం కావడం ఒకటైతే,.. జనాభా తక్కువ ఉండటం, డబ్బు కొరత లేకపోవడం వల్ల ఈ కంట్రీ హ్యాపియెస్ట్‌ లిస్టులో వరుసగా ఏడవసారి స్థానం దక్కించుకుంది. అయితే,.. ఫిన్లాండ్‌ ప్రజలు ఆనందంగా ఉండడానికి ప్రకృతితో దగ్గరి సంబంధం, ఆరోగ్యకరమైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ కారణమని యూనివర్సిటీ ఆఫ్‌ హెల్సింకీ పరిశోధకురాలు జెన్నిఫర్‌ డీ పావోలా వెల్లడించారు. జీవితంలో విజయం అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందని… ఫిన్లాండ్‌లో ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా తెలిపారు.

ఫిన్‌లాండ్‌ దేశస్తులు హ్యాపిగా ఉండటానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా. ఐక్యతా భావం ఇక్కడి వారికి ఎక్కువగా ఉంటుందని.. అలాగే ఎలాంటి చెడు పరిస్థితులతోనైనా పోరాడే శక్తిని కలిగి ఉంటారని.. అందరితో సామరస్యంగా జీవించడం వంటివి వీరిలో ఉంటాయని తెలిపారు. ప్రధానంగా చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్‌లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటి నుంచి నేర్పుతారట. ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగమని ఫ్రాంక్ మార్టెల్లా వెల్లడించారు. ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే, అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చని సూచించారు.

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్