మంత్రి ఉత్తమ్ కుమార్ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. సడన్ బ్రేక్ వేయడంతో వరుసపెట్టి కార్లు ఢీకొన్నాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి వద్ద ప్రమాదం జరిగింది. హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదాని వెనక ఒకటి వచ్చి కార్లు గుద్దుకున్నాయి. పది వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. డ్రైవర్ల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు.