Free Porn
xbporn
23.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీ రిజర్వేషన్ల రచ్చ

  2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలమైన నినాదం ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశం. అయోధ్య రామమందిరంతోపాటు మైనార్టీ రిజర్వేషన్లు రద్దు అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కమల నాథులు. దీంతో రిజర్వేషన్ల అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత కాక పుట్టించింది. ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేసి తీరుతామని బీజేపీ అగ్రనేతలు భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అయితే ఏపీలో మాత్రం ఎందుకో ఆ ఊసే ఎత్తడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ తెలంగాణలో రీసౌండ్ ఇస్తున్న మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశం ఏపీలో ఎందుకు సైలెంట్ అయింది.? దీని వెనకాల ఉన్న మతలబు ఏంటి..?

  ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అయోధ్య రామమందిరాన్ని తారకమంత్రంగా ఎంచుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. అయితే అయోధ్య రామ మందిరంతో పాటు మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని కూడా ఎన్నికల అస్త్రంగా ప్రయోగిస్తున్నారు కమలనాథులు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్ల రద్దు అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ అయితే మరో అడుగు ముందుకేసి మతపరమైన రిజర్వేషన్లు కొనసాగనివ్వనని తెలంగాణా గడ్డ మీదనే భీష్మ ప్రతిజ్ఞ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు దేశ అభి వృద్ధితోపాటు మేనిఫెస్టో అంశాలను ప్రచారం చేస్తూనే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లీం రిజర్వేషన్లు రద్దు చేస్తామని తెలంగాణలో ప్రకటించారు. ఆ నాలుగు శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ,బీసీలకు సర్దుబాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రచారంతో నిమ్న వర్గాల ఓట్లకు బీజేపీ గాలం వేసింది. అయితే పొరుగున ఉన్న ఏపీలో మాత్రం ముస్లిం రిజర్వేషన్ల మీద బీజేపీ అగ్రనేతలు ఊసే ఎత్తడం లేదు. నిజానికి మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. అది ఆ పార్టీ ఫిలాసఫీ. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కూడా మతపరమైన రిజర్వేషన్లను అసలు ఒప్పుకోదు. మత పరమైన రిజర్వేషన్లతో దేశంలో చీలిక వస్తుందని ఆరెస్సెస్ గట్టిగా నమ్ముతుంది. మరి ఆ మూల సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఏపీలో ఎందుకు గట్టిగా చెప్పడంలేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తు న్నారు. మైనార్టీ బుజ్జగింపులకు తమ మద్దతు ఉండదని ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్నలు సంధిస్తున్నారు.

   ఏపీలో టీడీపీ కూటమితో బీజేపీ జతకట్టింది. ఎన్నికల మ్యానిఫేస్టోతో సంబంధం లేకుండా చంద్రబాబు ఏకంగా ముస్లింలకు భారీ వరాలు ప్రకటించారు. లక్ష రూపాయల దాకా హజ్ యాత్రీకులకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే యాభై ఏళ్ళు నిండితే పెన్షన్ కూడా ఇస్తామని.. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే ముస్లింలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు మోదీ, అమిత్ షాలకు తెలియవా అన్న ప్రశ్నలు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. టీడీపీకి ఆ కూటమిలో ఉన్న బీజేపీకి కూడా ఓట్లు కావాలని అందుకే ఆ ప్రస్తావన చేయలేదని అంటు న్నారు. మైనారిటీలను బుజ్జగిస్తున్నారు అని కాంగ్రెస్ మీద విరుచుకుని పడే మోడీ షాలు ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండూ అదే పనిచేస్తున్నా ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా బలమైన స్లోగన్‌గా ఉన్న మైనార్టీ రిజర్వేషన్ల అంశం ఏపీలో మాత్రం వినపడడంలేదనే చర్చ జరుగు తోంది. మరి లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ ఎత్తుగడలతో రాజకీయ లబ్ది చేకూరుతుందా ? ఒక వేళ ఫలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్