తెలంగాణ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ది శాఖ జాయింట్ సెక్రటరీ కులదీప్ నారాయణ్ మంత్రి పొంగులేటితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్లలో పేదల ఇళ్ళ నిర్మాణాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి అన్నారు. ఎంతో మంది నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.