అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇప్పటికే తూట్లు పొడిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాజ్యాంగాన్ని ఒక్కొక్కటిగా మారుస్తున్నారన్నారు. సెక్యులర్ పార్టీలన్నీ కలిసి నడిచి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లౌకిక వ్యవస్థకు ఇప్పటికే భంగం కలుగుతుందని చాడ వెంకట రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యం ఉండాలంటే బీజేపీ ఉండొద్దన్నారు. తెలంగా ణ ఏర్పడిందంటే అది రాజ్యాంగం వల్లే అని చెప్పారు. అన్ని మతాలకు, వర్గాలకు సమాన హక్కులు ఉన్నాయంటే రాజ్యాంగం వల్లనే అని చాడ వెంకట్ రెడ్డి తెలిపారు.