స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల్లో గెలిచేదే కాంగ్రెస్ అని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. తాము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మోడీ మాయలు.. హామీలు ఇక్కడ చెల్లుబాటు కావని ఎద్దేవా చేశారు. బీజేపీ హామీలన్ని నీటి మాటలని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలిచే ప్రసక్తే లేదని.. ప్రజలంతా తమవైపే ఉన్నారని అన్నారు. మా మేనిఫెస్టోతో ప్రజల మనసు గెలవబోతున్నామని అన్నారు.