తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు కొనియాడారు.
దావోస్‌లో లక్షా 78 వేల 950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40 వేల 232 కోట్ల పెట్టుబడులు రాగా.. ఈసారి నాలుగు రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50వేల ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.