పసిపిల్లల ప్రాణాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటమాడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహారంగా కుళ్లిన గుడ్లు ఇస్తున్నారని అన్నారు. భువనగిరి, పెద్దవాడ సమ్మద్ చౌరస్తా అంగన్‌వాడీ కేంద్రంలో..ఆ కుళ్లిన గుడ్లు చిన్న పిల్లలు తింటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఎక్కడ? అని ప్రశ్నించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ఓ వైపు గురుకులాల్లో మరణాలు.. మరోవైపు అంగన్‌వాడీల్లో అడుగడుగునా అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. పిల్లల పాలిట యమపాశంగా కాంగ్రెస్ సర్కార్ తయారైందని అన్నారు కేటీఆర్.