కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మహబూబ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తు న్న వంశీచంద్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపుర్వకంగా కలిశారు. అలాగే, మహ బూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ ని కలిశారు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ తొలి జాబితాలో నాలుగురు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ప్రకటిం చింది. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్య ర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. రాహుల్ గాంధీ మరోసారి సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీ చేయ నున్నారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ – సురేశ్ కుమార్ షేట్కర్, నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్- చల్లా వంశీచందర్‌రెడ్డి, మహ బూబాబాద్ నుంచి బలరాం నాయక్‌లను అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు చేసింది.