38.2 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

రేపు మేదర మెట్ల సిద్ధం సభలో వరాల జల్లు

   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నూతన పథకాలపై ఏపీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ప్రకటించే సంక్షేమ పథకాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల కోసం జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఏంటి.? గత ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలు ఎంతమేరకు అమలు చేశారు.? సిద్ధం సభా వేదికగా ప్రజలకు జగన్ ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తు
తున్నాయి.

     వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో కార్యకర్తలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నా రు. ఇప్పటికే పలు సిద్ధం సభలు నిర్వహించారు. రేపు బాపట్ల జిల్లా మేదర మెట్లలో మరో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు దాదాపుగా 15 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు హాజరవుతారు అని అంచనా వేస్తు న్నారు. గతంలో సిద్దం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భీమిలి వేదికగా సిద్ధం సభను నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాలో కృష్ణాజిల్లాకు సంబంధించిన కలిపి దెందులూరు నియోజకవర్గంలో సిద్ధం సభను నిర్వహించారు. ఈ సభకు దాదాపు నాలుగు లక్షల మంది కార్యకర్తలు హాజరైనట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. అలాగే ఆ రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు దాదాపుగా 10 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యారని వైసీపీ భావిస్తోంది. అలాగే రేపు జరగబోయే సిద్ధం సభకు దాదాపుగా 15 లక్షల మంది కార్యకర్తలు వస్తారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా పార్టీ సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం ,నెల్లూరు జిల్లాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు.

   రేపటి సిద్ధం సభ వేదికగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనుందని ఆ పార్టీ సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించబోతున్న మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండబో తున్నాయి అనేది వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆకర్షణీయ పథకాలతో ప్రజల వద్దకు వెళ్లింది. ఈ పథకాల్లో బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, సబ్సిడీ పైన గ్యాస్ సిలిండర్లు, కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు చదువుకుం టున్నా వారందరికీ ఏటా 18 వేల రూపాయల నిధులు కేటాయించడం వంటి అనేక కీలక అంశాలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్నికల పొత్తుల నేపథ్యం లో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని హామీలు ఇచ్చేందుకు ఆ కూటమి సిద్ధమవుతుంది.

    టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కంటే మరింత సంక్షేమం అందించేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉండే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీసీ మేనిఫెస్టోలో ప్రధానంగా సామాజిక పెన్షన్ల పెంపుకు సంబం ధించి కీలక ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతు న్నారు. ఈ పెన్షన్ లను ఐదువేల వరకు పెంచుకుంటూ వెళ్తామని జగన్ హామీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలాగే డ్వాక్రా, రైతు రుణమాఫీ వంటి అంశాల పైన ప్రకటన చేసే అవకాశం ఉందనే తీవ్ర చర్చ జరుగుతుంది. అలాగే ప్రతి ఏటా నాలుగు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా ఇచ్చే అంశం పైన ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ ప్రకటన చేసే ఛాన్స్ ఉందని వాదనలు బలంగా వినిపి స్తున్నాయి.గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల ను 99% అమలు చేశామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అమ్మఒడి , రైతు భరోసా, గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటు, విద్యార్థులకు నూటికి నూరు శాతం ఫీజు రియంబ ర్స్మెంట్ డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీకి రుణాలు వంటి అనేక హామీలను అమలు చేశామని వైసీపీ అధినేత జగన్ చెప్తున్నారు. 

Latest Articles

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత

    తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడు భగభగ మండిపోతున్నాడు. మాడు పగిలే రేంజ్ లో ఎండలు విజృంభిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్