Meghalaya |మేఘాలయ అంటేనే సంకీర్ణ ప్రభుత్వానికి మరో పేరు. 1976 నుంచి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. హంగ్ అసెంబ్లీలు రావడం, అప్పటికప్పుడు చిన్నాచితకా ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవడం మేఘాలయలో ఒక సంప్రదాయంగా మారింది. మరోవైపు మేఘాయలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.నిన్నటివరకు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ మధ్య గొడవలు ముదిరాయి. దీంతో రెండు పార్టీలు ఒంటరిపోరుకు రెడీ అయ్యాయి. కాంగ్రెస్ కూడా బరిలో నిలిచింది.