29.2 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్‌ పర్యటన

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని అమెరికాలోని ఐటీ సర్వీసెస్‌ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు రేవంత్‌. ఐటీ సంస్థల అసోసియేషన్‌ ఐటి సర్వ్‌ అలయన్స్‌ సమావేశంలో.. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లను నిర్మించుకున్నామని.. ఇప్పుడు అందరం కలిసి ప్రపంచ స్థాయి నాల్గవ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుందని ప్రవాస భారయతీయులను ఉద్దేశించి మాట్లాడారు రేవంత్‌.

ఆర్థిక సేవలలో గ్లోబల్ లీడర్ అయిన చార్లెస్ స్క్వాబ్ భారతదేశంలో తన మొదటి టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఇందుకు హైదరాబాద్‌ను వేదికకానుంది. డల్లాస్‌లోని చార్లెస్ స్క్వాబ్ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో సీఎం రేవంత్‌, మంత్రి శ్రీధర్‌బాబు, సీనియర్ స్క్వాబ్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సమావేశమయ్యారు. చివరగా ఇండియాలో టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో తమ చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను నెలకొల్పడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్‌.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్