రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ప్రకటించి ఆ తర్వాత మాటను నిలబెట్టుకోలేక ప్రతిపక్షాల నోరుకు పని చెప్పారు. దీంతో రేవంత్ వర్సెస్ విపక్షాల మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడిచింది. ఆ సమయంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగింది. దీంతో మరోసారి ఆగష్ట్ 15 నాటికి రుణమాఫీ చేస్తా నని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రుణమాఫీపై కసరత్తు చేస్తు న్నారు సీఎం రేవంత్. త్వరలోనే రైతులకు శుభవార్తు చేప్పేందుకు సిద్ధమవుతున్నారు. రుణమాఫీ కసరత్తు నేపథ్యంలో త్వరలోనే కేబినెట్ నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రుణమాఫీపై రైతులు, రైతు సంఘాల నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో వారితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. అయితే, సంపన్నులకు రైతుబంధు, రుణమాఫీ ఇవ్వొద్దని రైతుల నుంచి సూచన లు అందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాల్లో సీలింగ్ తప్పని సరిగా ఉండాలన్న వినతుల మేరకు. అర్హులైన రైతులకే సహాయం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.