యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం రేవంత్, గీత దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికారు. లక్ష్మీ నారసింహు ని దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి భద్రాచలం వెళ్లనున్నారు. సీతారాములను దర్శించుకుని స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 5 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 5 వేల మంది మహిళలతో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు.