ఎన్నికల సీజన్ ముగియడంతో ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయానికి ముఖ్యమంత్రి రానున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించను న్నారు. ఈరోజు మధ్యాహ్నం తరువాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి… ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించను న్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు


