రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను సీఎం రేవంత్‌రెడ్డి కొనసాగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక కోటి ఎకరాలకు పైగా భూమి సాగులోకి వచ్చిందన్నారు. ఏపీలో జగన్ చేపట్టిన ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని.. అదే మాదిరిగా రేవంత్‌రెడ్డి చేయాలన్నారు. తెలంగాణ పొలాలను తడపకుండా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, గోదావరి జలాలు తరలిపోయాయని.. ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి భూమి సస్యశ్యామలమైందన్నారు ఎమ్మెల్సీ కవిత.