తెలంగాణ ప్రభుత్వం బ్రహ్మకుమారీల అడుగుజాడల్లో నడుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు నార్కోటిక్ టీమ్‌ను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. డ్రగ్స్ అనే పదం చెప్పేందుకు కూడా భయపడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారీస్ నడుస్తున్నారని, డ్రగ్స్ నిర్మూలనకు వారు కృషి చేయడం సంతోషకరమని అన్నారు. దేశంలోనే 31 వేల కోట్లు మాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ అన్నారు.