స్వతంత్ర వెబ్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. కొల్లాపూర్ పట్టణం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
కొల్లాపూర్ పట్టణానికి మంజూరు చేసిన ప్రత్యేక ఫండ్‌తో బ్రహ్మాండంగా మిగిలిన పనులన్నీ చేయాలని కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు. కొల్లాపూర్‌కు ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా మంజూరు చేస్తాం. రెండు, మూడు లిఫ్టులు అడిగారు. జిల్ దార్ తిప్ప లిఫ్ట్, బాచారం హై లెవల్ కెనాల్, పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడనింగ్, లైనింగ్, మల్లేశ్వరం మినీ లిప్ట్ కావాలని అడిగారు. అధికారుల చేత సర్వే చేయించి తప్పకుండా మంజూరు చేస్తాను. రూ. 10 కోట్లతో బోడగట్టు చెక్ డ్యాంకు రేపే జీవో ఇస్తాం.