స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నీతి ఆయోగ్ 8వ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశం కన్నా కేసీఆర్‌కు అతి ముఖ్యమైన పని ఏముంది? అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సిఎం కేసీఆర్ కి సోయి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం వేతనాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉందన్నారు. ఆదాయానికి మించి కేసీఆర్ అప్పులు చేయడంలో.. ఇప్పుడు అవి ముంచుకొస్తున్నాయని అన్నారు. సీఆర్ కుటుంబానికి అప్పుల దాహం తీరడం లేదని.. భూములు అమ్మడంతో కేసీఆర్ ఆకలి తీరడం లేదని మండిపడ్డారు.