CM Jagan | పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై గురువారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళల స్వయం సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ ద్వారా జీవనోపాధి లాంటి పథకాలతో వారికి జీవనోపాథి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఒకవైపు ఆర్థిక సాయంతో పాటు మరోవైపు బ్యాంకుల ద్వారా కూడా స్వయం ఉపాధి కోసం సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షలో ఉపాధి హామీ అమలు, గ్రామీణ రహదారులపై కూడా పలు సూచనలు చేశారు.