స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయల్దేరతారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ వాలంటీర్లను ముఖ్యమంత్రి సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, తదితరులు రానున్నారు.


