35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం జగన్

స్వతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో రేపు సీఎం జగన్ పర్యటించనున్నారు. రేపు 12వ తేదీ ఉ. 9 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో క్రోసూరుకు రానున్నారు. క్రోసూరు మోడల్ స్కూల్ లో జగనన్న విద్యాకానుక నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అనంతరం అమరావతి – బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.149 కోట్లతో అమరావతి – బెల్లంకొండ రోడ్ నిర్మాణం జరుగనుంది. అనంతరం మాదిపాడు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రూ.60 కోట్లతో కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగనుంది. అలాగే క్రోసూరులో రూ.7.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిని సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పిలుపునిచ్చారు.

Latest Articles

మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా.. విజయ్‌కు గవర్నర్‌ షాక్‌

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా…...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్