రాజ్యాంగ రూపకర్త డా.బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan) మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయనను ప్రశంసిస్తూ.. తనదైన శైలిలో రాసుకొచ్చారు. దేశం గర్వించదగ్గ మేధావుల్లో అగ్రగణ్యుడు, మహోన్నతుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్(Ambedkar) అని కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. న్యాయ, సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఆధ్యాత్మిక, తదితర రంగాల్లో అపార జ్ఞానశీలి. దేశ రాజకీయ, ప్రజాస్వామ్య, సాంఘిక వ్యవస్థలకు దిక్సూచి. వాటికి గట్టి పునాదులు వేసిన రాజ్యాంగ నిర్మాత అని వర్ణించారు. భేదభావాలు మరిచేలా మానవత్వం పరిఢవిల్లేలా ఆయన చేసిన కృషి మరువలేమని అన్నారు. ఆ మహనీయుడి బాటలో నడుస్తూ పేదరిక నిర్మూలనలో, సామాజిక న్యాయ సాధికారతలో చారిత్రక అడుగులు ముందుకేశామని గుర్తు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అరుస్తున్నామని పేర్కొన్నారు సీఎం జగన్(CM jagan).
Read Also: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదు
Follow us on: Youtube, Koo, Google News