స్వతంత్ర, వెబ్ డెస్క్: ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన 99 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. గతంలో సీపీఎస్ విధానంలో ఉద్యోగికి 400 రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేదన్నారు. సీపీఎస్ ను రద్దు చేస్తానని మచిలీపట్నంలో పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారని.. అన్నమాట ప్రకారం సీపీఎస్ ను రద్దు చేసి జీపీఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని కొనియాడారు. పే కమిషన్ వేసేందుకు గతంలో ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండేదని.. రోడ్డెక్కి ఉద్యమం చేయకుండా గతంలో ఏ ప్రభుత్వమూ పీఆర్సీ కమిటీ నియామకం చేయలేదన్నారు. ఏ ఉద్యోగీ రోడ్డెక్కకుండానే 12వ పీఆర్సీని సీఎం జగన్ ప్రకటించారని అన్నాడు.
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ మన ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పినట్లు కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను రెగ్యులర్ చేస్తున్నారు. ఉద్యోగుల పట్ల ఇంతగా సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం గతంలో ఏదీ లేదన్నారు. చంద్రబాబు కుమారుడికి భద్రత కరువైందని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు నోటికొచ్చినట్లుగా భద్రతా సిబ్బందిపై లోకేష్ మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే భద్రతను ప్రభుత్వం ఇచ్చిందని వ్యాఖ్యానించారు.