స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లులు కురిపించారు. చంద్రబాబు(Chandrababu) తన హయాంలో ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేశారని, ముఖ్యమంత్రి వైఎస్ ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చులకన భావం ఉందని అన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులతో అడ్డగోలుగా వ్యవహరించిందని విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ ఎన్జీవో(AP NGO) 21 రాష్ట్ర మహాసభలకు ప్రత్యేక అతిధిగా సీఎం జగన్ హాజరయ్యారు.
చంద్రబాబు ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని సీఎం అన్నారు. మొక్కుబడిగా కొన్ని మాత్రమే ఉద్యోగులకు మిగిల్చారని దుయ్యబట్టారు. బాబు హయాంలో దాదాపు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారని చెప్పారు. బాబు కాలంలో ఆర్టీసీ పరిస్థితి ఏంటి?.. పాఠశాలల దుస్థితి ఎలాంటిది? అలాంటివారు ఉద్యోగులకు న్యాయం చేయగలరా? అని ప్రశ్నించారు. బాబు, ఆయన వర్గానికి తమ ప్రభుత్వంపై కడుపు మంట అని సీఎం జగన్ మండిపడ్డారు.