సీఎం జగన్ మార్కాపురం పర్యటన వేళ జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో వైఎస్సార్ ఈబీసీ నేస్తం సభకి కూడా రానంటూ ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. వైసీపీ పెద్దలు ఆయనకి సర్దిచెప్పి తిరిగి తీసుకువచ్చారు. సీఎం జగన్ సైతం సభా వేదికపై బాలినేనిని బుజ్జగించారు.
ఈ క్రమంలో ఆయన చేసిన పనికి అంతా షాకయ్యారు. సభావేదిక పై బాలినేని ని తన పక్కకి పిలిచి ఈబిసీ నేస్తం బటన్ బాలినేని తో నొక్కించారు సీఎం జగన్. (కింద ఉన్న లైవ్ లింక్ లో ఆ దృశ్యాలు చూడవచ్చు) దీంతో అక్కడున్నవారంతా హర్షం వ్యక్తం చేశారు. కాగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయనకి అవమానం జరిగితే జగన్ ఎలా ఊరుకుంటారు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
ALSO READ : జగన్ పర్యటన వేళ మాజీ మంత్రి బాలినేనికి చేదు అనుభవం
Follow us on: Youtube, Koo, Google News


