కుండపోత వర్షాలు, వరదలతో విజయవాడ నగరం మొత్తం జలమయమయింది. భారీ వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. సీఎం చంద్రబాబు గ్రౌండ్‌లో ఉంటూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నిత్యావసరాలను దగ్గరుండి అందించారు. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మూడుపూటలా బాధితులకు ఆహారం అందించాలని సీఎం అన్నారు. చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. లంక గ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ సాయం అందుతుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.