ఏపీ సీఎం చంద్రబాబు రేపల్లె పర్యటన రద్దు అయింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ చేపట్టనున్న ఏరియల్ సర్వే, రేపల్లె పర్యటన రద్దు చేసుకున్నారు. వరద బాధితులకు ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య పనులను, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కాలనీలు, ఇళ్లలో ఉన్న బురదను తొలగించాలని సంబంధింత అధికారులను సీఎం ఆదేశించారు.