ఈనెల 31న కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ గ్రామంలో జరిగే పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ నవ్య, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటించి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్టీఆర్ భరోసా కింద ప్రభుత్వం అందించే సెప్టెంబరు నెల పింఛన్లను ఈ నెల 31నే లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. 1న ఆదివారం సెలవుదినం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 31న అందుకోలేకపోయిన లబ్దిదారులకు 2న అందించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంతవరకు 31నే 100 శాతం పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.