భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు. భోగాపురం వరకు బీచ్‌రోడ్ నిర్మాణం కూడా జరగాలన్నారు.. పారిశ్రామికంగా ఎదిగేందుకు భోగాపురం ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని.. తాను సీఎంగా ఉన్నప్పుడే అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు.. నేషనల్ హైవే నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీ పెంచాలని చెప్పారు.. గత ప్రభుత్వ వైఖరి వల్ల అన్నీ మళ్లీ మొదటి నుంచి చేయాల్సి వస్తోందని తెలిపారు. 2026 కల్లా భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామన్నారు. వేగంగా పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిపై ఉంని చంద్రబాబు స్పష్టంచేశారు.


