ఓయూలో జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమానికి కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్ట్‌పై సీఐ రాజేందర్ విచక్షణారహితంగా దాడి చేశాడు. దీనికి నిరసనగా సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ చౌక్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ చౌక్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేవారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని అఖిలపక్షం నాయకులు అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మీడియా, మీడియా ప్రతినిధులపై పోలీసులు దాడి చేయడమేంటని ప్రశ్నించారు. జర్నలిస్ట్ శ్రీ చరణ్‌పై దాడి చేసిన సీఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.