ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి కృష్ణానదికి జలహారతి ఇవ్వనున్నారు చంద్రబాబు. తర్వాత నీటిపారుదలశాఖ అధికారులతో భేటీ అవుతారు. అనంతరం శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శిచి.. నీటి వినియోగదారుల అసోసియేషన్‌తో భేటీ అవుతారు. తిరిగి హెలికాప్టర్‌లో అనంతపురం చేరకుంటారు.
టూర్‌లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాలలో లబ్దిదారులకు పింఛన్ అందిస్తారు. అనంతరం మల్బరి ప్లాంటేషన్ షెడ్‌ను సందర్శించి .. పట్టు రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. తర్వాత గుండుమలలో కరియమ్మ దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. కరియమ్మ గుడి వద్దనే గ్రామస్తులతో చంద్రబాబు ఇంటరాక్షన్ ఉండనుంది.. మధ్యాహ్నం 3:25 నుంచి 4:25 వరకు స్థానికులతో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానం ద్వారా అమరావతికి తిరిగి బయల్దేరనున్నారు.