స్వతంత్ర వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. కేసు విచారణకు రాగానే న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ సమయంలో మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్ కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబుకు (Chandra Babu)కు సుప్రీంకోర్టులో బుధవారం ( సెప్టెంబర్ 27) ఎలాంటి రిలీఫ్ రాలేదు. కేసు విచారణకు వస్తూనే ద్విసభ్య ధర్మాసనం బెంచ్ విచారణకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో, మరో బెంచ్ కు బదిలీ చేస్తూ నిర్ణయం ప్రకటించింది. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాదులు కేసు వెంటనే విచారించాలని కోరుతూ అభ్యర్దించినా సాధ్యం కాలేదు. ఆ వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు చీఫ్ జస్టిస్ ముందు ఈ కేసు మెన్షన్ కు ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్2వ తేదీ వరకు కోర్టుకు సెలవులు కావటంతో..వచ్చే నెల 3వ తేదీ తరువాతనే సుప్రీంలో ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.