చైనాలో HMPV కలవరపెడుతోంది. వైరస్ లక్షణాలతో అక్కడి జనం ఆస్పత్రుల ముందు క్యూ కట్టిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హ్యూమన్ మెటా నూమో వైరస్ వ్యాప్తి — COVID-19 లానే ఫ్లూ-శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం వంటి లక్షణాలతో చైనాలో విజృంభిస్తోంది. ఇక అన్ని దేశాలు చైనాలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి.
HMPV వైరస్‌కి సంబంధించిన కొన్ని పాయింట్స్
1.. చైనాలోని ఆసుపత్రుల్లో మాస్క్‌లు ధరించిన వ్యక్తుల ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి. స్థానిక నివేదికల ప్రకారం 2001 లో HMPV వైరస్‌ని గుర్తించారు. ఐదేళ్ల క్రితం కోవిడ్ వ్యాప్తి మాదిరిగానే కనిపించడం కలవరపెడుతోంది. కొవిడ్ ప్రపంచ మహమ్మారిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 7 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంది.
2… చైనా విదేశాంగ స్పోక్స్ పర్సన్ మావో నింగ్ మాట్లాడుతూ.. శీతాకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెప్పారు.
3.. చైనా పౌరులు, చైనాకు వచ్చే విదేశీయుల ఆరోగ్యంపై చైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని తాము హామీ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. చైనాలో ప్రయాణించడం సురక్షితమని అని అన్నారు.
4… కోవిడ్-19 బారిన పడిన దేశాల్లో భారతదేశం ఒకటి. చైనాలో హ్యూమన్ మెటా న్యూమోవైరస్ వ్యాప్తిపై ప్రజలు భయపడవద్దని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధికారి డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు.
5.. చైనాలో మెటా న్యూమోవైరస్ విజృంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెటా నుమో వైరస్ అన్ని శ్వాసకోశ వైరస్‌లా సాధారణ జలుబును కలిగిస్తుంది. జలుబు వచ్చినప్పుడు జ్వరం రావడం సహజమేనని అతుల్ గోయెల్ అన్నారు.
6…మేము దేశంలో శ్వాసకోశ వ్యాప్తికి సంబంధించిన డేటాను విశ్లేషించాము. డిసెంబర్ 2024 డేటాలో గణనీయమైన పెరుగుదల లేదు. మా సంస్థల నుండి పెద్ద సంఖ్యలో శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన కేసులు గుర్తించలేదు…. అని ఆయన చెప్పారు.
7.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చైనాలో వైరస్ వ్యాప్తిపై ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా బీజింగ్ ఎటువంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు.
8… చైనా పొరుగు దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. HMPV యొక్క కొన్ని కేసులను హాంకాంగ్ గుర్తించింది.
9… యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రకారం.. HMPV అనేది శ్వాసకోశ వైరస్, ఇది ఎగువ దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ఇది చిన్నపిల్లలు, వృద్ధులు, తక్కువ రోగనిరోధక వ్యవస్థలు ఉన్న అన్ని వయసుల వ్యక్తులపై ప్రభావితం చేస్తుంది.
10.. HMPV యొక్క లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయి. సాధారణ దగ్గు, జ్వరం, నాసికా రద్దీ, శ్వాస ఆడకపోవడం… తీవ్రమైన పరిస్థితుల్లో బ్రాన్‌కైటిస్, న్యుమోనియా వంటి సమస్యలకు దారితీస్తుంది.